సిరా న్యూస్,నల్గోండ;
వరస బైకు చోరీలకు పాల్పడుతున్న ఎనిమిది మంది ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఏపి రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పార్కింగ్ చేసి ఉన్న ఖరీదైన బైకులనే ముఠా టార్గెట్ చేస్తున్నట్టు, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 25 లక్షల 10 వేల విలువ గల 27 బైకులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.