సమస్యల పరిష్కారానికి గడపగడప కార్యక్రమాలు
వాలంటరీ సేవలు అమోఘం
మండల నాయకులు ప్రహ్లాద చారి, సర్పంచ్ పాల్ దినకర్ వైస్ ఎంపీపీ బుజ్జ స్వామి
కౌతాళం
అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కాలనీలో ఉన్న సమస్యల పరిష్కారానికి గడప గడప కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయని మండల నాయకులు ప్రహ్లాద చారి వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి , సర్పంచ్ పాల్ దినకర్,ఎంపీడీవో సుబ్బరాజు పేర్కొన్నారు గురువారం ఒకటో వార్డు ఒకటి ,రెండు ,మూడు, నాలుగు ,ఐదు ,ఆరు ,వార్డులలో గడపగడపకు కార్యక్రమాలు నిర్వహించారు. గడపగడప కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుతున్నాయా లేదా వాటి గురించి తెలియపరుస్తూ రాబోవు రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని కాలనీ వాసులను కోరారు. వార్డులలో వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యంగా ఉందని కాలనీవాసులకు అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించడం చాలా గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు కాధర్ భాష, చాగి లక్ష్మి, వీరేష్ ,బి లక్ష్మి ,గోవర్ధన్ ,విరిత నాయకులతోపాటు అధికారులతో పాటు ఇంటింటికి వెళ్లి కార్డులను అందజేశారు. గడపగడప కార్యక్రమంలో సర్పంచ్ పాల్ దినకర్ సమాద్, వడ్డే రాముడు,మాజీ సర్పంచ్ అవతార్ , బిమేష్,అశోక్, వడ్డే ఈరన్న, పాల్గొన్నారు.