సిరా న్యూస్, తలమడుగు:
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…
-తహసీల్దార్ రాజ్ మోహన్
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రాజమోహన్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్, పల్సి కె, లచ్చంపూర్, పల్లి బి, తదితర గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ… వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసమే ఈ ప్రజా పాలన గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మొదటిరోజు నాలుగు గ్రామ పంచాయతీలకు గాను 490 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. అర్హులైన లబ్ధిదారులంతా తప్పక దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీలతో పాటు ఫోన్ నెంబర్ ను సైతం జతచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాకాంత్, ఎంపీఈఓ దిలీప్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.