సిరా న్యూస్, ఆదిలాబాద్:
జిల్లా కోర్టు జీపిగా పి. దయాకర్
+ జీవో విడుదల చేసిన న్యాయశాఖ కార్యదర్శి
+ సోమవారం బాధ్యతలు స్వీకరించిన దయాకర్
ఆదిలాబాద్ ప్రధాన జిల్లా న్యాయస్థానం, ఇతర అదనపు జిల్లా న్యాయస్థానాలకు ప్రభుత్వం గవర్నమెంట్ ప్లీడర్‌ను నియమించింది. ప్రముఖ న్యాయవాది పి దయాకర్‌ను జీపీగా నియమిస్తూ సోమవారం ఈ మేరకు ప్రభుత్వం తరపున న్యాయశాఖ కార్యదర్శి ఆర్. తిరుపతి జీవో విడుదల చేసారు. కాగా దయాకర్ సోయవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ను ఈ మేరకు కలిసి, జీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జీపీగా తన బాధ్యతలను నిస్పక్షపాతంగా, చిత్తశుద్ధితో నిర్వహిస్తానని అన్నారు. జీపీగా నియమితులు కావడంతో దయాకర్‌కు న్యాయవాదులు, ఇతర ప్రముఖులు అభినందనలు తెలియజేసారు. పీపీలు సంజయ్ కుమార్ వైరాగరే, మేకల మధుకర్, ముస్కు రమణ రెడ్డి, న్యాయవాదులు అఫ్రోజ్, ముజాయిద్, భావన సింగ్, తదితరులు ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ మేరకు జీపీ దయాకర్‌ను శాలువాలతో సన్మానించారు.