సిరాన్యూస్, బేల
గూడలో కంది శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని గూడ గ్రామానికి చెందిన హనుమాన్ మందిరం ముందర షెడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 3లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధుల కోసం కృషి చేసిన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ప్లెక్సీకి శనివారం గూడ గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ బేల మండల అధ్యక్షుడు గవాండే ఘనశ్యామ్ , యూత్ కాంగ్రెస్ మండల్ అధ్యక్షుడు గోడే అవినాష్ , ఎస్ ఉప సర్పంచ్ గోడే దయరేవాన్ , రమేష్ బోయెర్, ఠాక్రే బాబురావు, ఠాక్రే సంతోష్, గోడే జగదీష్ , అమిత్, నీలేష్ ,విట్టల్, సంతోష్,ప్రకాష్, గెడం రాజు గూడ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.