సిరా న్యూస్,గుడిహత్నూర్
గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా హిందీ దినోత్సవం
ప్రభుత్వ జూనియర్ కళాశాల గుడిహత్నూర్ లో శనివారం రోజున హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్బంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డి.శ్రీనివాస్, హిందీ అధ్యాపకులు రాథోడ్ శ్రావణ్, కళాశాల సిబ్బంది జాతిపిత మహాత్మా గాంధీజీ ,హిందీ కవి ప్రేమ్ చంద్ చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు హిందీ భాషా ప్రాముఖ్యతను తెలియజేసేలా ఉపన్యాసాలు ,హిందీ దోహాలు,కవితల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యాక్రమం ప్రిన్సిపల్ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందడంలో హిందీ భాష కీలకమని, 1949 సెప్టెంబర్ 14న మన జాతీయ భాషగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. హిందీ అధ్యాపకులు రాథోడ్ శ్రావణ్ హిందీ భాష ప్రాముఖ్యతను, స్వాత్యంత్ర సమరంలో హిందీ భాషను ఆయుధంగా చేసుకోని గాంధీజీ నాయకత్వంలో భారతీయులు చేసిన పోరాటంను వివరించారు. కార్యక్రమంలో కళాశాల బోధన, బోధనేతర సిబ్బందివిద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
చాలా చక్కగా సిరా న్యూస్ లో ప్రచురించినందు తమరికి
ధన్యవాదాలు సర్