మంథని పట్టణం లోని పలు వినాయక మండపాల్లోమంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు

సిరా న్యూస్,మంథని;
పెద్దపల్లి జిల్లా మంథని లో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు మున్సిపాలిటీ పరిధిలోని పలు వినాయక మండపాల్లో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గణపతి నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని గణపతి నిమర్జనం కార్యక్రమాన్ని కూడా సురక్షితంగా జరుపుకోవాలని గణపతి కమిటీలను ఏర్పాటు చేశాము. గణపతి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కమిటీలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *