ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ సస్పెన్షన్
ఇంకో హెడ్ కానిస్టేబుల్ బదిలీ
గుడివాడ
గుడివాడ సిసిఎస్ పోలీస్ స్టేషన్ పై అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపద్యంలో ఆ ఆరోపణలు కాస్తా జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరడంతో ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. మరో హెడ్ కానిస్టేబుల్ ను నాగాలంక పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడినట్టుగా సమాచారం.
ఒక రికవరీ కేసుకు సంబంధించి
సిసిఎస్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు, కొలుసు శ్రీనివాసరావు, నాగేశ్వరావు, కానిస్టేబుల్ కుమార్ స్వామిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై దృష్టి సారించిన జిల్లా ఎస్పీ జాషువా, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు,కానిస్టేబుల్ కుమారస్వామిలను సస్పెండ్ చేసారు. మరో హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావుపై బదిలీ వేటు వేశారు. గత కొంతకాలంగా సిసిఎస్ పోలీస్ స్టేషన్ పై అనేక అవినీతి ఆరోపణలు వినవస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకారంతో తప్పించుకుంటూ వస్తున్నట్లుగా విమర్శలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గుడివాడ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఒక కానిస్టేబుల్ పై జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడం జరిగింది.