సిరా న్యూస్,ఖమ్మం
ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవం కార్యక్రమాన్ని అధ్యక్షులు ఎర్నింగ్ రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పెన్షనర్ల దినోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరైయ్యారు.ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతు పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మీకు ఏ విధమైన సమస్యలు ఉన్న పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల పెన్షనర్లకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుమారి గుడిపూడి ఫల్ల్య కూచిపూడి నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది.