సిరా న్యూస్,అత్మకూరు;
నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ సమీపంలో గంజాయి మత్తులో దీక్షిత్ అనే యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. పలువురుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు గాయాల పాలు కాగా స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గంజాయి మత్తులో కత్తితో హల్చల్ చేసిన దీక్షిత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.