Hanumakonda: బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి

సిరాన్యూస్, భీమదేవరపల్లి
* బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి
* హనుమకొండలో ఉద్రిక్తత
హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు కోడిగుడ్లతో దాడి చేశారు. వంగరలో పీవీ నరసింహారావు స్వగ్రామంలో పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్తుండగా బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లు పడటం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకే కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పలువురు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా బండి సంజయ్ మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించి దేశానికి ఎనలేని సేవలను అందించిన మహామనిషి అని, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానిగా పనిచేసిన ఏకైక నాయకుడు పీవీ నర్సింహారావు అని బండి సంజయ్ అన్నారు. అలాంటి వ్యక్తికి భారత రత్న ప్రకటించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని అన్నారు పీవీ చనిపోతే కనీసం ఢిల్లీలో అంత్య క్రియలు జరపకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *