*పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
* ధాన్యం రవాణా పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం రవాణాకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అవసరమైన వాహనాలు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం రవాణా పై అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం రవాణా కోసం అవసరమైన మేర వాహనాలను సమకూర్చాలని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ వాహనాలు లేకపోవడం వంటి ఇబ్బందులు రావడానికి వీలులేదని, టెండర్ లో సూచించిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం రవాణా సంబంధించి వాహనాలు అందుబాటులో లేవని తన దృష్టికి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని, వాహనాల సరఫరాకు ఇబ్బందులు ఉంటే ఇప్పుడే టెండర్లు రద్దు చేసుకోవాలని, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అవసరమైన వాహనాలు ఎప్పటికప్పుడు సరఫరా చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం రవాణా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి శ్రీ మాల, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.