ఒక్కొక్కరు 16 మంది పిల్లలను కనండి

సిరా న్యూస్,సిరా న్యూస్;

ప్లీజ్.. పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, అవసరమైతే లీవ్స్‌ పెట్టండని అంటోంది. ఎందుకని ఈ మార్పు… మొన్న జపాన్, నిన్న చైనా… ఇప్పుడు భారత్… కొత్త స్లోగన్ అందుకుంటున్నాయి..యువత తగ్గిపోతున్న కారణంగా చైనా జీడీపీ కూడా తగ్గుతోంది కాబట్టి. ఇక జపాన్. అమెరికా తరువాత అత్యంత శక్తివంతమైన దేశం. ఎకానమీలో అమెరికా తరువాత జపానే. కాని, చేజేతులా ఆ ప్లేస్‌ను చైనాకు ఇచ్చేసింది. 2010 తరువాత ఆ సెకండ్ ప్లేస్‌ను చైనా లాగేసుకుంది. కారణం.. జపాన్‌లో పిల్లల సంఖ్య తగ్గడం. యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగినందుకు.. జపాన్ ఆర్థిక వ్యవస్థే కుంచించుకుపోయింది. ఇక ఇండియా. అతి త్వరలోనే జర్మనీని క్రాస్‌ చేసి జపాన్‌ ప్లేస్‌లోకి వెళ్లబోతోంది. మూడునాలుగేళ్లలో టాప్-3 ఎకానమీగా ఇండియా ఉండబోతోంది ఇండియా. కారణం.. యూత్ ఎక్కువగా ఉండడం. యువత లేని దేశాలు ఆర్థికపరంగా ఎలా కిందకు పడిపోతున్నాయో స్వయంగా చూస్తున్నాం. అదే యువత ఉన్న కారణంగా ఆర్థికంగా ఇండియా ఎలా ఎదుగుతోందో కూడా చూస్తున్నాం. యూత్ లేకపోతే దేశాలు అభివృద్థి చెందడం లేదా, చైనా-జపాన్ టాప్ పొజిషన్‌లో లేవా అని. ఇప్పటికైతే.. ధనిక దేశాల జాబితాలో చైనా, జపాన్ సెకండ్ అండ్ థర్డ్‌ పొజిషన్‌లో ఉన్నాయి. కాని, చైనా, జపాన్ ఆర్థికవ్యవస్థల స్పీడ్‌ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. కారణం.. యూత్ లేకపోవడమే. ఎప్పుడైనా సరే.. కొత్త టెక్నాలజీని అడాప్ట్‌ చేసుకునేదే యూత్. కొత్త టెక్నాలజీతో వచ్చే వస్తువులను కొనేదే యువత. వాళ్లే లేటెస్ట్ టెక్నాలజీ వెంట పడకపోతే.. ఇక వాటిని తయారు చేయాల్సిన అవసరం ఏంటి? అదే జరిగితే.. కొత్తగా కనిపెట్టడం కూడా అనవసరమే కదా. రీసెర్చ్ అండ్‌ డెవలప్‌మెంట్, లేటెస్ట్ ఇన్నోవేషన్స్ అన్నీ దండగేగా. అందులోనూ యూత్‌లో రిస్క్‌ తీసుకునే కల్చర్ ఎక్కువగా ఉంటుంది. స్టార్టప్‌ కావొచ్చు, మరేదైనా బిజినెస్ కావొచ్చు.. రిస్క్‌ తీసుకుని ముందుకు వెళ్తేనే ప్రాఫిట్స్ వస్తాయి. అమ్మో రిస్క్‌ ఎందుకు అని భయపడితే.. అలాగే ఉండిపోతారు. సో, యూత్‌ లేని దగ్గర ఈ రిస్క్‌ కల్చర్ తగ్గిపోతుంది. అదే జరిగితే.. ఎకానమీపై ఎఫెక్ట్ చూపిస్తుంది.ఈ ప్రపంచంలో రెండు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి సేవింగ్ ఎకానమీ, రెండోది స్పెండింగ్‌ ఎకానమీ. నిన్న మొన్నటి వరకు ఇండియాది సేవింగ్ ఎకానమి. వచ్చిన దాన్లో ఎంతో కొంత దాచుకోవడమే చూశాం. ఇప్పుడు భవిష్యత్‌పై భయం పోయింది. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం లేదిప్పుడు. సో, దాచుకోవడం తగ్గించి కాస్త ఎక్కువ ఖర్చు చేయడం మొదలుపెడుతున్నాం. అమెరికాది ప్యూర్‌గా స్పెండింగ్ ఎకానమి. అక్కడ ఐదు రోజుల పాటు సంపాదించిన డబ్బుని వీకెండ్‌లోని రెండు రోజుల్లో ఖర్చు పెట్టేస్తారు. కారణం.. సోమవారం నుంచి మళ్లీ చేతిలో డబ్బులు పడతాయనే భరోసా. అమెరికా సహా యూరప్‌ దేశాలది స్పెండింగ్ ఎకానమీస్ కాబట్టే.. రెండు ప్రపంచ యుద్ధాలను ఫేస్‌ చేసిన తరువాత కూడా అంతే ఫాస్ట్‌గా డెవలప్‌ అయ్యాయి. అమెరికాను పక్కన పెడితే యూరప్‌ దేశాలు, జపాన్ ఇప్పటికీ స్పెండింగ్‌ ఎకానమీసే. కాకపోతే.. అక్కడ కొనే యూత్‌ లేరు. వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతో.. ఉన్న దాంతోనే సంతృప్తిపడడం ఎక్కువైపోయింది. సో, ఖర్చు పెట్టడం తగ్గిపోయింది. ఎక్కడైతే ఖర్చుపెట్టడం తగ్గుతుందో, ప్రాడక్ట్స్‌ సేల్స్‌ తగ్గుతాయో.. ఇక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతున్నట్టే అర్థం. ప్రస్తుతం జపాన్‌లో ఆ పిరియడే నడుస్తోంది. చైనాలో త్వరలో అలాంటి సిచ్యుయేషన్ రాబోతోంది.ఇక ఫిన్లాండ్. ప్రపంచంలోనే ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్న దేశాల్లో టాప్‌లో ఉంటుందది. నేరాలు లేని దేశం కూడా. ఎంత సంతోషమయమైన దేశం అయితే మాత్రం ఏం లాభం..! యూత్ లేరక్కడ. యునైటెడ్ నేషన్స్ ప్రకారం 2030 నాటికి ఫిన్లాండ్ దేశంలోని 47 శాతం మందికి పైగా ప్రజలు 65 సంవత్సరాలు దాటుతారు. అంటే.. దేశంలో సగానికి సగం వృద్ధులే. ప్రపంచ మొత్తం మీద జపాన్ తర్వాత 65 సంవత్సరాలు దాటిన వారు ఎక్కువగా ఉన్న దేశం ఫిన్లాండ్. ఇక కొరియా కూడా టెక్నాలజీలో అప్‌గ్రేడెడ్‌ కంట్రీనే. అక్కడ కూడా యూత్‌ తగ్గిపోతోంది. యూత్ తగ్గుతోంది అనడం కంటే.. అసలు పిల్లల్ని పెద్దగా కనడమే లేదు అని చెప్పుకోవాలేమో. ముగ్గురు చనిపోతుంటే ఒకరు పుడుతున్నారు. కొరియాతో పాటు జపాన్‌, చైనాలోనూ పెళ్లి, పిల్లలపై ఇంట్రస్టే కనిపించడం లేదు అక్కడి యువతకి. ఏమంటే.. సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నారు. పెళ్లి చేసుకుంటే.. ఫ్యామిలీ బర్డెన్‌ మోయాలి, వాళ్ల కోసం కష్టపడాలి, ఇంకాస్త ఎక్కువ సంపాదించాలి అనే మెంటల్‌ స్ట్రెస్‌లో ఉన్నారు. సో, సింగిల్‌గా ఉన్నంత ఉత్తమం లేదనుకుంటున్నారు. అక్కడి ఆడవాళ్లు కూడా అదే మైండ్‌సెట్‌తో ఉన్నారు. పిల్లల్ని కనాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, బండెడు చాకిరీ చేయాలి. అదే పెళ్లి చేసుకోకపోతే.. లైఫ్‌ అంతా సింగిల్‌గా ఉంటూనే ఎంజాయ్‌ చేయొచ్చు అని ఫీలవుతున్నారు. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే.. చైనా, జపాన్‌లో ఇప్పుడు కనిపిస్తున్న డెవలప్‌మెంట్‌ అంతా ఆగిపోతుంది. అభివృద్ధి తగ్గిపోతుంది కూడా. ఎందుకంటే.. టెక్నాలజీపైనా, రీసెర్చ్‌పైనా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పైనా పెట్టాల్సిన ఇన్వెస్ట్‌మెంట్‌ని.. భవిష్యత్తులో హాస్పిటల్స్ కోసం, ఓల్డ్‌ ఏజ్ హోమ్స్‌ కోసం, వారికి ఇవ్వాల్సిన పెన్షన్స్‌ కోసం, హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ కోసం పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే స్లోగన్ వస్తోంది.. నిన్న చంద్రబాబు.. ఇవాళ స్టాలిన్ పిల్లలను కనండి అంటూ కామెంట్స్ చేసేస్తున్నారు.దక్షిణ భారతదేశంలో మధ్య వయసు వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారిప్పుడు. 2047 నాటికి.. వీళ్లంతా వృద్ధుల జాబితాలోకి వెళ్తారు. సంతానోత్పత్తి రేటులో జాతీయ సగటు 2.1 ఉంటే.. సౌత్‌ ఇండియాలో సంతానోత్పత్తి రేటు 1.6కి పడిపోయింది. అంటే.. ఏపీతో సహా దక్షిణాదిన వృద్ధాప్య సమస్య సంకేతాలు కనిపించడం మొదలైందన్నమాట. ప్రస్తుతం ఇండియాలో యూత్‌ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యేం లేదు. మన దగ్గరున్న యూత్ సగటు వయసు 29 సంవత్సరాలు. ప్రపంచంలో మరే దేశంలో లేని యూత్‌ ఇండియాలోనే ఉన్నారు. 2047 వరకు జనాభాపరంగా, యూత్‌ పరంగా మనకొచ్చిన ఇబ్బందేం లేదు. మరో పాతికేళ్ల వరకు ఇప్పుడున్న యువతే దేశాన్ని నడిపిస్తుంది. మరి ఆ తరువాత..? ఇప్పుడు యావరేజ్‌గా 29 ఏళ్లున్న వాళ్లు పాతికేళ్ల తరువాత రిటైర్మెంట్‌కు దగ్గరపడతారు. సో, 2047 తరువాత వృద్ధ భారతం తయారవొచ్చు. అలా కాకుండా ఉండాలంటే.. ఇదిగో ఇప్పటి నుంచే ఒక కుటుంబం ముగ్గురు నలుగురిని కనాలని చెబుతున్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదనే చట్టం ఉంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఏమంటున్నారో తెలుసా. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది అని.ఒకప్పుడు జనాభా నియంత్రణను పాటించి, విజయవంతంగా పూర్తి చేసింది దక్షిణాది రాష్ట్రాలే. అదే.. ఆనాడు చేసిన తప్పు అని ఇప్పుడు ఫీల్‌ అవుతున్నాయి. చదువుకున్న వాళ్లు ఎవరైనా.. ఒకరు లేదా ఇద్దరు అనే అనుకుంటారు. కేరళ.. అక్షరాస్యతలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన రాష్ట్రం. అందుకే, కేరళ కూడా అదే పని చేసింది. అక్కడ జనాభాను బాగా నియంత్రించారు. 1970’s, 1980’s మధ్య జనాభా నియంత్రణకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఒకరిద్దరు పిల్లల్ని కంటే చాలు అంటూ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో జనం కూడా అదే ఫాలో అయ్యారు. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటక.. ఇలా రాష్ట్రాలన్నీ జనాభాను నియంత్రించాయి. అప్పుడు అలా చేసిన కారణంగా.. ఇప్పుడు వృద్ధుల సంఖ్య వేగంగా పెరిగే రాష్ట్రాలుగా మిగలబోతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. అందుకే, కేరళ సైతం జనాభాను పెంచేస్తామనే అంటోంది. దానికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన వాటా కూడా జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఎంపీ సీట్ల తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు.. జీడీపీ వాటా కూడా తగ్గుతుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ సంచలన ప్రకటన చేశారు. ‘ప్రతి ఒక్క జంట.. 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదు’ అని ప్రశ్నించారాయన. ‘కొత్తగా పెళ్లయిన జంటలకు 16 రకాల ఆస్తులను పొందాలని పూర్వం పెద్దలు ఆశీర్వాదించేవారు. ఇప్పుడు ఆస్తికి బదులుగా 16 మంది పిల్లలను కనాలని, వారు ఆనందంగా జీవించాలని దీవించండి అంటున్నారు సీఎం స్టాలిన్. సీఎం స్టాలిన్‌ది ఆవేశం కాదు.. ఆవేదన. జనాభా నియంత్రణ విధానాలు పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోయి, నిధుల కేటాయింపులో కోత పడుతోందన్న ఆవేదన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *