ఇద్దరు పిల్లల తల్లిపై మోజు పడి,,,

సిరా న్యూస్,హైదరాబాద్;
సూరారం పీఎస్ పరిధిలో నాలుగు రోజుల కనిపించకుండా పోయిన చిన్నారి కేసు విషాదాంతమైంది.హైదరాబాద్‌ సూరారం బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానితుడిగా తిరుపతి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో కీలక విషయాలు బయటకొచ్చాయి. మొత్తం కుటుంబాన్ని చంపేందుకు నిందితుడి కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిపై మనసుపడ్డ నిందితుడు తిరుపతి.. ఇద్దరు పిల్లలు, ఆమె భర్తను చంపేందుకు ప్లాన్‌ చేసినట్లు ఒప్పుకున్నాడు. దానిలో భాగంగానే.. పిల్లల్ని చంపేసి ముళ్ల పొదల్లో పడేయాలని నిర్ణయించుకుని ఒక బాలికను దారుణంగా హత్య చేసిన నిందితుడు.. మరో చిన్నారి హత్యకు సిద్ధమైనట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడం కలకలం రేపుతోంది. ఇక.. పాపను హత్య చేసి మేడ్చల్‌ అటవీ ప్రాంతంలో వేసినట్లు చెప్పడంతో ఆయా ప్రాంతాల్లో గాలించారు పోలీసులు. దాంతో.. అటవీ ప్రాంతంలో మూట కట్టి పడేసిన ఓ సంచిని స్వాధీనం చేసుకున్నారు. పాప డెడ్‌బాడీగా గుర్తించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. కాగా.. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు.అదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్ కుటుంబంతో సూరారంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 12న కుమార్తె ఏం.జోష్న (7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు బాలిక కోసం దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే.. అనుమానంతో తిరుపతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. 12 ఏళ్ల కుమార్తె హత్యపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గోనె సంచిలో బాలిక మృతదేహం కనిపించింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. చిన్నారులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని, అపరిచితులకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్ హైదరాబాద్ వచ్చి కుటుంబంతో పాటు సూరారం కాలనీలో నివాసం ఉంటున్నాడు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా, జోత్స్న పెద్ద కుమార్తె, వయసు ఏడు సంవత్సరాలు.ఈ విషయంపై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న బాలిక తండ్రి ప్రభాకర్, తల్లి సుమ కన్నీరు మున్నీరవుతున్నారు. వారి పక్క ఊరైన తిరుపతి వీరి ఇంటికి వచ్చే క్రమంలో సుమతో పరిచయం ఏర్పడింది. ఆమెను కలిసేందుకు వస్తున్న క్రమంలో పాప అడ్డు వస్తుందనే హత్య చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *