సిరా న్యూస్,హైదరాబాద్;
నాన్ వెజ్ ప్రియులకు సండే మండేతో తేడా లేదు. ఎప్పుడు పెట్టినా నాన్ వెజ్ లాగించేస్తారు. కానీ ధరలు ఎక్కువ ఉంటే మాత్రం కాస్త ఆలోచించక తప్పదు. అలాంటప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే తినగలరు. కానీ ధర తక్కువ ఉంటే వారికి పండగే అని చెప్పాలి. తినాలి అనిపించడమే ఆలస్యం తెచ్చుకుని వండుకోవడమే.అయితే అలాంటి నాన్ వెజ్ ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కార్తీకమాసం కావడంతో చాలా మంది నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. ప్రతి ఇంట్లోనూ పూజలు చేస్తుంటారు. దేవుడిని ఆరాధిస్తూ చాలా పవిత్రంగా ఉంటారు. దీంతో చికెన్ ధరలు భారీగా తగ్గబోతున్నట్టు సమాచారం అందుతోంది. రెండు వారాల క్రితం చికెన్ ధరలు భారీగా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.270 నుండి రూ.300ల మధ్య ఉంది.కాగా ప్రస్తుతం ధరలు చాలా వరకు తగ్గిపోయాయి. చాలా పట్టణాలలో కేజీ చికెన్ రూ.180 నుండి 200 మాత్రమే ఉంది. అంతే వంద నుండి 70 రూపాయాల వరకు తగ్గిపోయింది. అయితే చికెన్ కు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ధరలు అలాగే కొనసాగుతున్నాయి. ఇక ఈ నెల చికెన్ ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ వర్కాలలో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా డిసెంబర్ నెలలో తిరిగి ధరలు పుంజుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.