బంధ చెరువు గట్టుకు గండి
సిరా న్యూస్,పరవాడ;
మండల కేంద్రం పరవాడలో మంగళవారం రాత్రి ఎడతెరపి లేకుండా కురిసిన వానకి గ్రామంలో అన్ని రహదారులు వర్షపు నీటితో నిండి చెరువులని తలపించాయి. రాత్రి 7 గంటల నుంచి 9 గంటలు వరకు ఏకాధాటిగా వర్షం కురవగడంతో పల్లపు ప్రాంతాలు అన్ని నీట మునిగాయి. స్థానిక ఏసి కాలనీలో ఇళ్లలో భారీగా నీరు చేరాయి. .గ్రామం మొత్తం మీద వర్షం నీరు అంతా స్థానిక బంధ చెరువులో కలుస్తుడడంతో ఒక్క సారిగా వచ్చి చేరిన వర్షం నీరుతో చెరువు పొంగి బంధ చెరువు నిండింది. గండి కొట్టడంతో చెరువులో నీరు అంతా పక్కనే ఉన్న పెద్ద చెరువులో కలవడంతో పెద్ద ప్రమాదం తెప్పింది. ఈ చెరువు క్రింద ఇప్పటికే రైతులు సుమారు 20 ఎకరాలలో పంట పడించారు.