దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

సిరా న్యూస్,విశాఖ;
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి 35 – 45 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. ఆదివారం అత్యధికంగా ఒంగోలులో 8 సెంమీ వర్షపాతం నమోదు అయింది. మంగళవారానికి తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం వుందని వాతావరణ శాఖ సూచించింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *