హై క్వాలిటీ లిక్కర్ చీప్ కే…

సిరా న్యూస్,నెల్లూరు;
మందు.. ఇది చాలా మందికి ఓ ఎమోషన్. అలవాటు పడ్డ బ్రాండ్‌ తప్ప వేరేది తాగాలంటే అబ్బే అంటుంటారు. గత ఐదేళ్లలో ఏపీలో మద్యం ప్రియులు ఇదే సిచ్యువేషన్‌ను ఫేస్‌ చేశారు. ఏవేవో కొత్త మద్యం బ్రాండ్లు టేస్ట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్నాళ్లో వేచిచూసిన ఉదయం రానే వచ్చింది. తక్కువ ధరకే మంచి మందు దొరకబోతుంది.మంచి మందు టేస్ట్‌ కోసం తెలంగాణకు పోవాల్సిన అవసరం లేదు. అక్రమ దందా అని అభాసుపాలు కావాల్సిన పని లేదు. ఉన్న ఊరిలోనే ప్రజలకు ఛీప్ రేటులో హైక్వాలిటీ లిక్కర్‌ అందుబాటులో తేస్తుంది ప్రభుత్వం. అంతేకాదు లిక్కర్ దందా చేయాలనుకునేవారికి కూడా మంచి రోజులు వచ్చేసినట్లే.దసరాలోపే కొత్త మద్యం దుకాణాలను అందుబాటులోకి తేనుంది. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ లిక్కర్ పాలసీని చేంజ్ చేసింది. కొత్త బ్రాండ్లను తెచ్చింది. టెండర్ల విధానం తీసేసింది. దీంతో లిక్కర్ దందా చేసే లీడర్లు, వ్యాపారులకు బిజినెస్‌ చేసే ఆప్షన్ లేకుండా పోయింది. జనాలు కూడా ఏవేవో పిచ్చిపిచ్చి బ్రాండ్లతో కాలం నెట్టుకురావాల్సి వచ్చింది.ఇప్పుడు కొత్త లిక్కర్ పాలసీతో ఏపీలో మద్యం వ్యాపారులకు.. మందు ప్రియులకు కిక్కే కిక్కు లభించనుంది. టెండర్ల విధానంతో అన్ని పార్టీల నాయకులు లాటరీలో షాపులు దక్కించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు తెలంగాణ నుంచి వెళ్లి కొందరు ఏపీలో షాపుల కోసం టెండర్లు వేస్తున్నారు. మందుబాబులకు కూడా గత ఐదేళ్ల కంటే ముందున్న బ్రాండ్లు మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఏపీలో మొత్తం 3వేల 396 మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి కూటమి సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు స్వీకరణ కొనసాగుతోంది. అప్లికేషన్ ఫీజ్‌ రూ.2లక్షలుగా డిసైడ్ చేశారు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 9 వరకు అప్లికేషన్లు స్వీకరించి..11న కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. ఈనెల 12 నుంచే మద్యం దుకాణాలను ప్రారంభించుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వంకొత్తగా లైసెన్స్‌లు పొందే దుకాణాలకు ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పిస్తారు. 3వేల 396 మద్యం షాపులకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు రాష్ట్రంలో మద్యం ధరల్ని కూడా తగ్గించారు. రూ.99కే క్వార్టర్‌ మద్యం లభించేలా రేట్లు నిర్ణయించారు.ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మాట నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. ప్రజలకు ఆరోగ్యానికి హానికరంగా లేని.. తక్కువ ధరలో మంచి లిక్కర్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేశారు. అంతేకాదు కొత్త లిక్కర్ పాలసీతో ఏపీ సర్కార్‌కు ఆదాయం కూడా చేకూరనుంది. దాదాపు 3వేల 4వందల షాపులకు టెండర్లు దాఖలైతే అవి కూడా వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కొత్త మద్యం పాలసీతో స్వామికార్యం.. స్వకార్యం అన్ని నెరవేరబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *