Hindi Bhasha Seva Samiti Sukumar Petkule :20న జిల్లా స్థాయి హిందీ దినోత్సవ కార్యక్రమం:  హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పేట్కులే

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
20న జిల్లా స్థాయి హిందీ దినోత్సవ కార్యక్రమం:  హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పేట్కులే

హిందీ దినోత్సవ పక్షోత్సవాలో భాగంగా ఈనెల 20వ తేదీన అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో “హిందీ దినోత్సవ కార్యక్రమం” జరుగుతుందని హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ లో గల ఫూలే గెస్ట్ హౌస్ లో సంఘ సభ్యులతో కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హిందీ సాహితీవేత్తలు, ఆదిలాబాద్ ఎంపీ, అదిలాబాద్, బోత్, ఖానాపూర్ ఎమ్మెల్యే లు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా విద్యాశాఖ అధికారి, జెడ్పి సీఈవో, సాహితివేత్తలు పాల్గొననున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇటీవల పదోన్నతి పొందిన వంద మంది హిందీ ఉపాధ్యాయులని ఈ సందర్భంగా సన్మానించనున్నామని, అలాగే విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన, పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులను వెంట తీసుకొచ్చి ఆయా పోటీల్లో పాల్గొనేలా చేయాలని విజేతలకు బహుమతుల ప్ర‌దానం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ద్రోణాలే, ఉపాధ్యక్షులు ఆర్. సాంబన్న షిండే, ఎస్. శ్రీహరి, కోశాధికారి చంద్రశేఖర్ అంబేకర్, కార్యదర్శి జావిద్ అలీ, కార్యవర్గ సభ్యులు ప్రధాన్ భాస్కర్, నల్వాల రమేష్, తెలంగ్ గణేష్, కాలే శ్రీనివాస్, భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *