సిరా న్యూస్;
తెలుగు రాష్ట్రాల్లో వరద సహాయానికి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ఇస్తున్నారు. వరద బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ. కోటి విరాళం ప్రకటించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.
అలాగే ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి వైజయంతి మూవీస్ సంస్థ రూ. 25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. దర్శకుడు త్రివిక్రం, నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగ వంశీ విరాళలు ప్రకటించారు. యువహీరో సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షల విరాళం ప్రకటించారు. మరో యువహీరో విశ్వక్షేన్ ఏపీకి రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. విరాళాలు ప్రకటించిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.