సిరా న్యూస్, ఆదిలాబాద్
మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలి: కలెక్టర్ రాజర్షి షా
* గణేష్ విగ్రహాల పోస్టర్ ఆవిష్కరణ
మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వినాయక చవితి పండుగ ను పురస్కరించుకొని పర్యావరణం పై అవగాహన కల్పించేందుకు మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను కలెక్టర్ రాజర్షి షా తన క్యాంప్ కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడారు. పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకొని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని , రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో భాగాంగ 8 అంగుళాల మట్టి గణపతిలను అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు టీజీపీసీబీ నిర్వహంచడం జరుగుతుందని తెలిపారు. అవగాహన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తం గా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన ఆటోట్రాలీ ల ద్వారా పర్యావరణ సందేశాలతో టీజీపీసీబీ ద్వార చేపట్టడం జరుగుతుందని, మట్టి గణపతి ద్యారా పర్యావరణ పరిరక్షణ పై పాఠశాలలో, కళాశాలల్లో క్వీజ్ కార్యక్రమాలు నిర్వహించడం, చేతి వృత్తిల వారికి మట్టి విగ్రహలు తయారిపై శిక్షణ, ఆటోల వెనుక, పోస్టర్ల ప్రదర్శన, బస్టాప్ లలో హోర్డింగ్ లు మట్టి గణేష్ ల ద్యారా పర్యావరణ పరిరక్షణ పై కళాజాత ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ లక్ష్మణ్ ప్రసాద్, రంజిత్ కుమార్, సాయి ప్రసాద్, శివ కృష్ణ ఉన్నారు.