సిరాన్యూస్, ఆదిలాబాద్
జోగు రామన్నకు మతిభ్రమించింది : ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుని కలిస్తే మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, తెలివి కోల్పోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. సిమెంట్ పరిశ్రమ తెరిపించేందుకు పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుని కలిసి తాను విన్నవిస్తే జోగు రామన్న రాజకీయాలు అంటగట్టడం శోచనీయమన్నారు. 8 ఏళ్ల కిందట ప్రారంభించిన చేనాక కొరట ఇప్పటికీ పూర్తి కాలేదని, ఒక ఎకరం భూమి కూడా తడవలేదని, మంత్రిగా ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయకపోగా ఎదుటివారిని రాజకీయ ఆక్రస్తో విమర్శిస్తున్నారని అన్నారు. సిమెంటు పరిశ్రమను కమిషన్ల కోసం ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తున్నారని రామన్న ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్కు చెందిన మంత్రిని కలిస్తే రాజకీయ అక్కకు వెళ్ళబోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా మంత్రిగా గతంలో ఏ కాంట్రాక్టర్ దగ్గర ఎన్ని కమిషన్లు నొక్కావో తెలుసునని అన్నారు. అవసరం వచ్చినప్పుడు నీ బండారం బయటపెడతానని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ కేంద్ర మంత్రిని జోగు రామన్న ఎందుకు కలిశాడు సమాధానం చెప్పాలని తెలిపారు. అభివృద్ధి కోసం ఎవరినైనా కలవచ్చని మంచి పనులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సహకరిస్తానని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అంకత రమేష్ , మయూర్ చంద్ర , లాలామున్నా , జోగు రవి, దినేష్ మాటలియా, దయాకర్ , ముకుంద్ , తోకల నరేష్, మహేష్, వెంకన్న, భీమ్ సన్ రెడ్డి తదితరులు ఉన్నారు