పెద్దపల్లి లో హైడ్రా హల్చల్

 సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హైడ్రా,భూ అక్రమణదాధారులను హడలెత్తిస్తోందీ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలతో ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే డిపార్ట్ మెంట్ ల అధికారుల బృందం పెద్దపల్లి మండలం, పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బందంపల్లి చెరువు రంగంపల్లి చెరువు ల కు సంబంధించి న ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ల జాబితాను పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ కు అందజేసిది. దాంతో రంగంలోకి దిగిన మున్సిపల్ శాఖ అధికారులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లలో ఉన్న కట్టడాలను కూల్చి వేశారు. . పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బందంపల్లి చెరువు సమీపంలోగల బఫర్ జోన్ లో నిర్మాణం చేపట్టగా అట్టి నిర్మాణాన్ని జేసిపి సహాయంతో కూల్చి వేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల తో రానున్న రోజుల్లో పెద్దపల్లి మున్సిపల్ మరియు మండల పరిధిలోని గ్రామాల్లో గల చెరువుల అంతర్ భాగంలో గల అక్రమ కట్టడాలను ప్రక్షాళన చేసే దిశగా అధికారులు ముందడుగేయబోతున్నారని ఆర్డీవో గంగయ్య తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *