సుత్తిలి బాంబులకు భయపడను

కేటీఆర్
 సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
సిరిసిల్ల లో ఎంఎల్ఏ, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఉచిత విద్యుత్ పేరుతో కాంగ్రెస్ ఉన్నా విద్యుత్ పోగొట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. పేద మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిచేందుకు ప్రయత్నం చేస్తుంది. అదాని అంబానీ లకు సిరిసిల్ల నేతన్న లకి ఒకే కేటగిరి ఎలా. దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం..పైసా పెంచలేదు. ఇప్పుడు కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల భారం వచ్చాయి. గత పదేళ్లుగా ఆత్మహత్యలు లేవు, కానీ 10 నెల్లలో 10 మంది చనిపోయారు. సిఎం బుర్ర మార్చుకో బుద్ధి మార్చుకో అని అన్నారు. దీపావళి ముందే బాంబులు పెలుతాయని అని పొంగులేటి కామెంట్స్ పై కేటీఆర్ మాట్లాడుతూ అయన పై జరిగిన ఈడి రైడ్స్ గురించి చెప్తాడు కావచ్చు. ఎం చేస్తారో చేసుకోండి ఎం పిక్కుకుంటారో పిక్కుకోండి. గీ చిట్టి నాయుడు ఎం చేస్తాడు. హౌల గాళ్ళకి భయపడుతానా. చిల్లర కేసు పెట్టీ జైలుకి పంపిస్తారు కావచ్చు అంతే. ఒర్జినల్ బాంబులకి భయపడలేదు గీ సుతిల్ బాంబులకు భయపడనని అన్నారు.
జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ పై కేటీఆర్ మండిపడ్డారు. జగిత్యాల ఎంఎల్ఏ రాజకీయ వ్యబిచారి, పార్టీ మారిన 10 మంది రాజకీయ వ్యబిచారీలు. జగిత్యాల లో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారు. మోడీ నాయకత్వంలో సిఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని ఆరో్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *