ముసుగు దొంగను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి

-మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు

సిరా న్యూస్,మంథని;
మంథని మండలం గుంజపడుగు గ్రామంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ కట్టుకొని కత్తితో మినీ ఎటిఎం నడుపుతున్న మహిళ ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించాడని ఈ ముసుగు దొంగను ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు అన్నారు. ఈ ముసుగు దొంగకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సీసీ కెమెరాలలో లభించాయని సిఐ తెలిపారు . ఇతడిని ఎవరైనా గుర్తుపట్టినట్టయితే మంథని సిఐ 8712656528, మంథని ఎస్సై 8712656529 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *