సిరా న్యూస్,నల్గోండ;
నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం రంగుండ్ల గ్రామం నుంచి శుక్రవారం అర్ధరాత్రి 12 గేదెలు, 22 ఎద్దులను కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సాగర్ పోలీసులు పట్టుకున్నారు. గేదెలు,ఎద్దులను చండూరు బోరుగడ్డ గోశాలకు తరలించారు. దొంగతనంగా గేదేలు,ఎద్దులను తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసారు. గేదెలు,ఎద్దులు విలువ సుమారు 40 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.