సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెగడపల్లి గ్రామంలో సింగిల్ విండో.ఐకేపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ మీ విజ్జన్న ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ధాన్యం కోతల అనే పదానికి తావు ఇవ్వమని స్పష్టం చేశారు. సీజన్లో కొనుగోలు కేంద్రాలలో తాలు తరుగు పేరుతో ఎక్కడైనా కటింగ్ చేస్తే రైతులు తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రానికి వస్తానని రైతులకు హామీ ఇచ్చారు. సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని రైతులు ఎలాంటి సందేహాలకు పాల్పడవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి. రైతుల అభ్యున్నతి కోసం పాటు పడుతుందన్నారు. రైతులకు ఏమాత్రం అన్యాయం జరిగిన ఉప్పెక్షించేది లేదన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా రైతుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, శ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి.తహసీల్దార్లు, ఎంపీడీవో లు,ఏపిఎం లు, సీఈఓలు మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గజనవేన సదయ్య, ఎండి మునీర్,మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, తుల మనోహర్ రావు.మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.