సిరా న్యూస్,కడప;
వేంపల్లి సమీపంలోని మాలంక బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్లెట్ వాహనంలో వెళుతున్న వెంకట రమణారెడ్డి, బాలగంగాధర్ రెడ్డి అనే తండ్రి కొడుకును ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఘటనలో కుమారుడు బాలగంగాధర్ రెడ్డి మృతి చెందాడు. వీరపు నాయుని పల్లి మండలం మొయిలచెరువు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వెంకటరమణారెడ్డిని 108 లో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.