సిరా న్యూస్,రంగారెడ్డి;
నాగోల్ మమతా నగర్ రోడ్ నెంబర్ 2 లో ఉండే ఝాన్సీ అనే మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేశారు నాగోల్ పోలీసులు.తన కూతురు జాన్సీ కనిపించడం లేదని తల్లి తండ్రులు నాగోల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. గురువారం ఉదయం తమ ఇంటికి సమీపంలో ఉండే పుట్టింట్లో తన ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి.. ఇంటికి వెళ్ళొస్తానని బయటకు వెళ్ళింది. అలా వచ్చిన ఆమె నేరుగా ఇంటికి వెళ్ళి.. తన మనసు ఏం బాలేదని, అందరినీ విడిచి వెళుతున్నా అని, దీనికి తన భర్త నరేశ్ కు సంబంధం లేదని చెప్పి ఓ లేఖ రాసింది. ఒక బ్యాగ్ చేతిలో పెట్టుకొని వెళ్ళిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో తను నాగోల్ లో జెబీఎస్ బస్ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు . తనూ ఇంటి నుండి బయలు దేరిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి అని నాగోల్ పోలీసులు తెలిపారు.