సిరా న్యూస్,ఖమ్మం;
భారీ వర్షాలకు సత్తుపల్లి జేవిఆర్,కిష్టారం ఓసి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. జేవిఅర్ ఓసి లో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి,1 లక్ష 80 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలిగించే పనులకు ఆటంకం కలిగింది. కిష్టారం ఒసి లో 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి,30 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలిగించే పనులకు అంతరాయం ఏర్పాడింది. వర్షం కారణంగా క్వారీల్లో డంపర్లు, డోజర్లు ఎక్క డికక్కడే నిలిచిపోయాయి. భారీగా వర్షపు నీరు నిలవడంతో సింగరేణి సిబ్బంది నీటిని బయటకు తొలగించే పనుల్లో నిమగ్నమైయారు.