సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో వచ్చిన గుడ్లల్లో పురుగులు రావటంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. వల్లంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి స్థానిక అంగన్వాడి సెంటర్ కి వెళ్లి గుడ్లు తీసుకొచ్చాడు. తెచ్చిన గుడ్లను విప్పి చూడగా పురుగులు ఉండడంతో ఒకసారిగా ఆందోళన చెందాడు. పిల్లలకు పౌష్టికాహారం కోసం అందించే గుడ్లలో పురుగులు రావడం, కుళ్ళిపోయిన గుడ్లు కనబడడంతో ఆవేదన వ్యక్తం చేశాడు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కుళ్ళిపోయిన గుడ్లు ఇవ్వడం వల్ల పిల్లలకు తీవ్ర అనారోగ్యం చేస్తుందని చెపుతున్నాడు. తీసుకొచ్చిన గుడ్లను ఇంటిపక్క వాళ్లకు చూపించాడు. అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యతలేని గుడ్లు పంపిణీ చేయవద్దని వారు తెలుపుతున్నారు.