పలు హోటళ్లలో తనిఖీలు..నోటీసుల జారీ

సిరా న్యూస్,హైదరాబాద్;
గ్రేటర్ హైదరాబాద్ లోని హోటల్స్, రెస్టారెంట్స్ పై జీహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారుల నాన్ స్టాప్ దాడులు నిర్వహించారు. మూసాపేట్ కృతుంగ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేసారు. కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని నిర్ధారించారు. కుళ్లిన చికెన్ ను కృతుంగ హోటల్ నిర్వాహకులు రోజుల తరబడి ఫ్రిజ్ లో నిల్వ ఉంచారు.ష మరోవైపు, ఓల్డ్ సిటీ సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర, ఉడిపి, సంతోష్ డాబా రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు జరిపారు. హోటల్స్ కిచెన్ లో బొద్దింకలు గుర్తించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుర్తించారు. కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నారు. ఫంగస్ వచ్చిన అల్లం ను స్టోర్ రూమ్ లో గుర్తించారు. ఆహార పదార్థాల్లో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నారు. కిచెన్ లో అపరిశుభ్రమైన వాతావరణం వుంది. దాంతో హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *