మహా శివరాత్రి మహోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం

మార్చి 8 నుండి 10వ తేదీ వరకు శివరాత్రి మహోత్సవాలు
సిరా న్యూస్,తిరుపతి;

తిరుచానూరు సమీపంలో గల యోగిమల్లవరంలో కొలువుదీరిన మహిమాన్వితమైన శ్రీ కామాక్ష్యంబా సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలలో పాల్గొనాలని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని, తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డిని ఆలయ ఛైర్మెన్ శ్రీధర్ రెడ్డి ఆహ్వానించారు. గురువారం తుమ్మలగుంట చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాసం వద్ద ఆలయ మహా శివరాత్రి వేడుకల గోడ పత్రికను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆవిష్కరించారు. పురాతన శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని తప్పక హాజరువుతానని స్పష్టం చేశారు.అలాగే తిరుచానూరు కే రామచంద్రారెడ్డి దంపతులకు మహా శివ రాత్రి వేడుకల ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు . మార్చి 8 నుంచి 10వ తేదీ వరకు శివరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఛైర్మెన్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. మార్చి 8వ తేదీన ప్రత్యేక అభిషేకం, మధ్యాహ్నం ప్రదోష అభిషేకం, 9వ తేదీ ఏకాంత సేవ, అన్నదాన కార్యక్రమాలు,10వ తేదీ శ్రీ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.400 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు పసుపు, కుంకుమ, పసుపుదారం, కండవ, జాకెట్టు, టెంకాయ, తాంబూలం, లడ్డు ప్రసాదం, బ్యాగును భక్తులకు అందజేస్తామని తెలిపారు. భక్తులు శివరాత్రి వేడుకల్లో పాల్గొని స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు. శివరాత్రి వేడుకల్లో కార్యక్రమాల దాతగా సర్పంచ్ కె.రామచంద్రా రెడ్డి వ్యవహరిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఓ మమత, ప్రధాన అర్చకులు మూర్తి గురుకుల్, పాలకమండలి సభ్యులు తిరుపాల్ రెడ్డి, వాసు, వార్డు మెంబర్ లోకేశ్వర్ రెడ్డి, డివిజనల్ అధ్యక్షులు సూర్య, శరవణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *