Sridhar Cherukuri : రైతాంగానికి సాగునీరు అందేలా చూడాలి

జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

నీటి లభ్యత, సాగునీటి వ్యవస్థ పై సమీక్ష సమావేశం

సిరా న్యూస్,బద్వేలు;

రైతులకు సాగునీరు అందించి పంటలు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ లోని బోర్డ్ రూమ్ హాలులో జిల్లాలో నీటి లభ్యత, సాగునీటి పంపిణీ, తాగునీటి సరఫరాపై నీటిపారుదలశాఖ, వ్యవసాయ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన మ్యాప్‌ లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… రైతులకు అందించే సాగునీటి నిర్వహణ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసి రైతులకు మేలు జరిగేలా అన్ని పంటలకు నీరు అందేలా చూడాలన్నారు.జిల్లాలోని భారీ,మధ్య, చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులలో ఎన్ని టీఎంసీల మేరకు నీటి నిలువ ఉన్నాయని వాటి కింద ఎంత ఆయకట్టు ఉందని సంబంధిత ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లాలో వ్యవసాయ పరిస్థితులు ఖరీఫ్,రబీ సీజన్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు.వాటి ఉత్పత్తి, మార్కెటింగ్, స్టాక్ వంటి అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవోలు వ్యవసాయ, నీటిపారుదల శాఖలతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించుకుంటూ వారానికి ఒక సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే జిల్లాలోని త్రాగునీటి వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు

ఈ సమావేశంలో కడప, బద్వేలు, జమ్మలమడుగు,ఆర్డీఓలు జాన్ ఇర్విన్,చంద్రమోహన్, సాయి శ్రీ, ఇరిగేషన్ ఇంజనీర్లు, వ్యవసాయ అధికారులు, గ్రౌండ్ వాటర్ అధికారులు,ఆయా మండల తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *