కలెక్టర్ పమేలా సత్పతి
సిరా న్యూస్,కరీంనగర్;
ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. స్వీప్, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం – 2025లో భాగంగా కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శనివారం, ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
శనివారం జిల్లాలోని పలు పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ సందర్శించారు.
జిల్లా కేంద్రంలోని ముకరంపురలో వాణినికేతన్ పాఠశాలలో, కొత్తపల్లి లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, రామడుగు మండలం వెదిర ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
1 జనవరి 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు, మరణించిన వారి ఓట్లను తొలగించడంతోపాటు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నివాసాన్ని మార్చిన ఓటర్లు సైతం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వన్ పర్సన్- వన్ ఓటు విధానం పాటించాలన్నారు.
డబుల్ ఓట్లను తొలగించాలని సిబ్బందికి సూచించారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని.. అర్హులు ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు.
నూతన ఓటరు గా నమోదుకు ఫామ్ -6, ఓటర్ ముసాయిదా లో అభ్యంతరాల కోసం ఫారం – 7, సవరణలకు ఫారం – 8 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలు. ఆన్ లైన్ voters.eci.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. వారి వెంట
అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్టీవో మహేశ్వర్, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, తహసీల్దార్ రాజేశ్, తదితరులు ఉన్నారు.