భారత్ కు దూరమేనా….

సిరా న్యూస్;
అనుర కుమార దిసనాయకే… వామపక్ష భావాలున్న ఒక నాయకుడు శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే తొలిసారి.అనుర కుమార దిసనాయకే, జనతా విముక్తి పెరమునె (జేవీపీ) పార్టీకి చెందినవారు.లోతైన వామపక్ష భావజాలం కలిగిన పార్టీగా జేవీపీ పేరుగాంచింది.ఎక్కువగా మధ్యేవాద, మితవాద నాయకులే పాలిస్తున్న శ్రీలంకను ఇప్పుడు ఒక వామపక్ష నాయకుడు పాలించనుండటం అక్కడి రాజకీయల్లో వచ్చిన చెప్పుకోదగిన మార్పు.జేవీపీకి ఉన్న భారత వ్యతిరేక వైఖరి.. వామపక్ష ధోరణి కారణంగా దిసనాయకే ప్రభుత్వం ఇప్పుడు శ్రీలంకను చైనాకు చేరువ చేసి, భారత్‌కు దూరం చేస్తుందా?
అనేది చాలామందికి కలుగుతున్న ప్రశ్న.అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 38 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి శ్రీలంక చరిత్రలో తొలిసారి ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది.దిసనాయకే, పొరుగు దేశాలైన చైనా, భారత్‌లతో ఎలా వ్యవహరిస్తారనేది కీలకంగా మారనుంది.జనతా విముక్తి పెరమునెకి భారతదేశంపై అనుకూల దృక్పథం లేదు. లంక అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి అనుర కుమార దిసనాయకే అందరి దృష్టినీ ఆకర్షించారు.గత ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్లకే పరిమితమైన ఈయన, ఈసారి ఏకంగా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.అనుర కుమార
దిసనాయకే 1968 నవంబర్ 24న అనురాధపురం జిల్లాలోని తంబుతెగామ ప్రాంతంలో జన్మించారు.తంబుతెగామ కామినీ మహా విద్యాలయం, తంబుతెగామ సెంట్రల్ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత పెరదేనియా యూనివర్సిటీలో చేరారు.అనుర కుమారకు చదువుకునే రోజుల నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేది.ఈయన 19 ఏళ్ల వయసులో, శ్రీలంకలోని వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరమునె(జేవీపీ)లో చేరారు.అనంతరం పెరదేనియా యూనివర్సిటీ నుంచి బయటికొచ్చేసి, కెళని యూనివర్సిటీలో చేరారు.జేవీపీ ఈయన్ను సోషలిస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ ఆర్గనైజర్‌‌గా నియమించింది. ఆ పార్టీ సెంట్రల్ వర్కింగ్ కమిటీలోనూ చోటు కల్పించింది.2000లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.ముఖ్యంగా 1980లలో, శ్రీలంక వ్యవహారాల్లో భారతదేశ ప్రమేయాన్ని ఆ పార్టీ తీవ్రంగా విమర్శించింది. శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో తమిళ వేర్పాటువాద ఉద్యమాలకు మద్దతు ఇవ్వడంలో భారత్ పాత్ర వారికి నచ్చలేదు.శ్రీలంక విషయంలో భారత్ ఆధిపత్య వైఖరిని ప్రదర్శించిందని జేవీపీ ఆరోపించింది.వామపక్ష ధోరణి కారణంగా దిసనాయకే సహజంగా భారత్‌ కంటే చైనా వైపు ఎక్కువ మొగ్గు చూపుతారనేది సాధారణ భావన.శ్రీలంక పట్ల భారత్ అనుసరిస్తున్న విధానాన్ని కూడా జనతా విముక్తి పెరమునె చాలా కాలం విమర్శించింది.శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశలో సెప్టెంబర్ 16న జరిగిన రాజకీయ చర్చా కార్యక్రమంలో
భారత్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే శ్రీలంకలో అదానీ గ్రూపు పెట్టుబడులున్న పవన విద్యుత్‌ ప్రాజెక్టును రద్దు చేస్తానని ఆయన అన్నారు.శ్రీలంక సార్వభౌమత్వానికి ఈ ప్రాజెక్ట్ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.ఈ పరిణామాలన్నీ అనుర కుమార దిసనాయకేపై భారత్‌కు వ్యతిరేకి అనే ముద్ర వేశాయి.భారత్‌పై జేవీపీకి వ్యతిరేక వైఖరి ఉన్నప్పటికీ, ‘దిసనాయకే’ను భారత విధానకర్తలు దూరం పెట్టలేదు.భారత్ కొంతకాలం నుంచి దిసనాయకేతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆయనను భారత్‌కు ఆహ్వానించింది. భారత్‌లోని కీలక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడితో సంబంధాలు కొనసాగించడానికి భారత్ ఆసక్తితో ఉందని దీన్నిబట్టి అర్థం అవుతోంది. తమ పొరుగు దేశాల్లో జరిగే పరిణామాల గురించి భారత్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది’’ అని ప్రొఫెసర్ జేవియర్ అన్నారు.భారత ప్రభుత్వం ఫిబ్రవరిలో దిసనాయకేను దిల్లీకి ఆహ్వానించింది. ఆయన అప్పుడు పంజాబ్‌లో కూడా పర్యటించారు. చాలామంది ప్రముఖ
నేతలను కలిశారు. భారత్ పట్ల జేవీపీకి ఉన్న చారిత్రక వైఖరి గురించి వారికి స్పష్టంగా తెలుసు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల విషయంలో భారత్ మొదటి నుంచి అప్రమత్తంగానే ఉంది.అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు శ్రీలంకలోని భారత రాయబారి సంతోష్ ఝా మాట్లాడుతూ.. ‘‘మేం ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వడం లేదు. ఎవరు గెలిచినా కొత్త అధ్యక్షుడితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.దిసనాయకేను సంతోష్ ఝా వ్యక్తిగతంగా కలవడం అనేది శ్రీలంక కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనే భారత ప్రభుత్వ ఉద్దేశాన్ని చాటుతోంది.ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దిసనాయకేకు శుభాకాంక్షలు తెలిపారు.దిసనాయకే, భారత్‌ల మధ్య కీలక వివాదాంశం శ్రీలంకలోని అదానీ పవన విద్యుత్ ప్రాజెక్ట్. 2023 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టును ఆమోదించారు.తన ఎన్నికల ప్రచార సభల్లో దిసనాయకే ఈ ప్రాజెక్టును ప్రస్తావించారు.శ్రీలంక సార్వభౌమత్వానికి ఈ ప్రాజెక్ట్ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.భారత్‌కు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఈ ప్రాజెక్టులో 442 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,700 కోట్లు) పెట్టుబడి పెడుతోంది. మన్నార్, పూనగారిలో విండ్ ఫార్మ్స్‌ను అభివృద్ధి చేస్తోంది.పర్యావరణం,విద్యుత్‌ అధిక ధరల కారణంగా అనేక వర్గాల నుంచి ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకత వ్యక్తమవుతోందిఇప్పుడు దిసనాయకే కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో భారత వ్యతిరేక వైఖరిని అనుసరించే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.‘అదానీ ప్రాజెక్టు విషయానికొస్తే అదొక వివాదాస్పద అంశం. జేవీపీ మాత్రమే కాకుండా పర్యావరణ బృందాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా దీనిపై ఆందోళనల వ్యక్తంచేశాయి. కాబట్టి ఈ విషయంలో దిసనాయకే వ్యతిరేకతను మొత్తంగా భారత వ్యతిరేక వైఖరిగా చూడకూడదు. మోదీ, అదానీలు ఈ ప్రాజెక్టును పునఃపరిశీలించాలి’’ అని కొలంబో యూనివర్సిటీ ఎమెరిటస్ ప్రొఫెసర్ జయదేవ ఉయాంగోడ అన్నారు.ఈఅంశంపై జాఫ్నా యూనివర్సిటీకి చెందిన అహిలాన్ కదిర్‌గామర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.దిసనాయకే విదేశాంగ విధాన నిర్ణయాలను
ప్రభావితం చేసే మరో కీలక అంశం శ్రీలంక ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం.పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విదేశీ నిల్వలు అడుగంటడం, అంతర్జాతీయ రుణదాతల వద్ద భారీగా తీసుకున్న అప్పుల కారణంగా శ్రీలంకకు ఇప్పుడు వీలైనంత సహాయం అవసరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *