శిక్షణ పొందిన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వుల అందజేత

సిరా న్యూస్,కమాన్ పూర్;
సింగరేణి సంస్థ రామగిరి కాలనీ పరిధిలోని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని ఎం.వి.టి.సి. లో 48 రోజుల శిక్షణ పూర్తయిన 27 మంది డిపెండెంట్లకు శుక్రవారం జి.ఎం. కార్యాలయంనందు నిర్వహించిన కార్యక్రమంలో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొప్పుల వెంకటేశ్వర్లు పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ఉద్యోగంలో చేరుతున్నారని, అయితే ఆ స్థాయికి తగ్గట్టుగా పని చేస్తూ, అధికారులు, సూపర్వైజర్ల ఆదేశాలను పాటిస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, భద్రతతో విధులు నిర్వహిస్తూ మీకు ఈ ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించిన మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. చెడు అలవాట్లకు బానిస కావొద్దని అన్నారు. విధులకు క్రమం తప్పకుండా హాజరవుతూ, సీనియర్ ఉద్యోగుల దగ్గర క్రమశిక్షణతో పని నేర్చుకొని, కలిసి కట్టుగా పనిచేసి మున్ముందు మంచి పదోన్నతులు సాధించి కుటుంబంతో పాటు సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రాతినిధ్య సంఘ ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, ఎస్వోటుజిఎం బి.సత్యనారాయణ, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ గుర్రం శ్రీహరి, ఎంవిటిసి మేనేజర్ మల్లన్న, సీనియర్ పి.ఓ పి.రాజేశం, జూనియర్ అసిస్టెంట్ క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *