-వేదోపచారాలతో లక్ష తులసి అర్చన
– మేళ తాళాల మంగళ వాయిద్యాలు తో స్వామివారి గరుడ వాహన సేవ
సిరా న్యూస్,చేవెళ్ల;
చేవెళ్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యఫలం భక్తులు భావిస్తారు.
ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేవెళ్ల దేవాలయ శాఖ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా వైకుంఠ ఏకాదశి నిర్వహించారు.
శ్రీవారికి మూలవిరాట్లకు ప్రత్యేకంగా ఈరోజు తిరువంజనం చేసి అనంతరం స్వామివారి ఆలయ లోపలికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనే భావంతో స్వామివారి ఆలయంలోకి మొదటి దర్శనంగా గోవుని తీసుకెళ్లి స్వామి వారిని దర్శించి అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త (అర్చకులు) శ్రీపాద్ ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి అసలు శాస్త్రం ఏమి చెబుతుంది దానిపైన మాట్లాడుతూ…ఆలయంలో ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా తులసి అర్చన మరియు గోపూజ భక్తులకు స్వామివారి ప్రాంగణంలో స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.
వివిధ జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి అధిక సంఖ్యలో స్వామివారి దర్శించుకున్నారు. సుమారు ఇప్పటివరకు ఒక 6000 పైగా స్వామివారి దర్శించుకోవచ్చు అని అన్నారు.
ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. హిందూ పురాణాల ప్రకారం ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగిన ఉంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు.
వైకుంఠం వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని భక్తుల నమ్మకం. ఈరోజున వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం వద్ద భక్తులు వేకువఝాము నుంచే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. అందుకే ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను కలిగి ఉంటుందని చెబుతారు. ఈ కార్యక్రమంలోని.ధర్మకర్తలు పూజారి శ్రీకాంత్,వేద వాష్, శ్రీనివాస్, దేవాదాయ శాఖ చైర్మన్ నరేందర్, ఆలయ అర్చకులు, తదితరులు భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు..