జలియన్ వాలాబాగ్

సిరా న్యూస్;

నరమేధంతో ఉధ్భవించిన సింహం కామ్రేడ్ ఉధ్ధామ్ సింగ్ -నరరూపరాక్షసుడు బ్రిటిష్ జనరల్ డయ్యర్ ను లండన్ లో కాల్చిచంపిన క్రాంతిదినం నేడే

ఉద్దమ్ సింగ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు జెనరల్ మైకెల్ ఓ డయ్యర్ను చంపినందుకు ప్రసిద్ధుడయ్యాడు. ఈ డయ్యరే జలియఁవాలాబాగ్ హత్యాకాండకు సూత్రధారి. ఉద్దమ్ సింగ్ తన పేరును రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్ గా, భారతదేశంలోని మతాలైన హిందూ, మొహమ్మదీయ, సిక్కు మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ, మార్చుకున్నాడు. ఇతడి త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు. 20వ శతాబ్దపు మొదట్లో భగత్ సింగ్, రాజ్‍గురు, ఇంకా సుఖదేవ్తో పాటుగా ఉద్దమ్ సింగ్ ని కూడా తీవ్రవాద స్వాతంత్ర్య సేనానులుగా గుర్తించవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వం వీరిని ఆనాడే భారతదేశపు మొదటి మార్క్సిస్టులుగా పేర్కొనింది. 1940 మార్చి 13న జలియన్ వాలా బాగ్ సంఘటనకు ప్రతీకారంగా ఉద్దం సింగ్ లండన్ కాక్స్‌టన్‌ హాల్‌లో మైకేల్ ఓ డయ్యర్‌ని కాల్చి చంపి, లొంగిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *