సిరాన్యూస్, జైనథ్
జామిని పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల జామినిలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు , గ్రామస్తులతో కలిసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ దసరా సెలవులు ముగింపు సందర్భంగా ముందస్తుగా బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.రంగురంగుల పూలను శిఖరంగా పేర్చి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులంతా కలిసి ఆనందంగా చేసుకునే పండుగే బతుకమ్మ, పువ్వుల పండుగగా పిలిచే ఈ ఉత్సవం సాంస్కృతిక, సంప్రదాయ,సామాజిక, అనుబంధాల సమాహారం అని అన్నారు. జామిని గ్రామంలో పూసిన పూలన్నింటినీ సేకరించి, ఇంద్రధనుస్సుల్లా పేర్చడం బతుకమ్మ వేడుకలో ప్రధానమని అన్నారు. బంతి,చామంతి, గునుగు,గుమ్మడి, తంగేడు,గడ్డి పూలు తదితర పూలతో ముందస్తు సంబరాలు చేసుకున్నామని చెప్పారు. విద్యార్థినులు , ఉపాధ్యాయురాళ్ళు, గ్రామ యువతుల బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాళ్ళు జ్యోతి, జయశ్రీ, ఉపాధ్యాయులు లక్ష్మణ్, గంగన్న, పెంటపర్తి ఊశన్న, గ్రామస్తులు ఇందు, యశోద, ప్రతిభ, గ్రామ యువతులు లలితా, అనూరాధ, వనజ, బిందు ,జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.