సిరా న్యూస్, కాకినాడ (గొల్లప్రోలు):
రైతులకు నష్టపరిహారం అందించాలి..
– జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్
మిచౌంగ్ తుఫాన కారణంగా పంటలు నష్టపోయిన రైతులందకి వెంటనే పంట నష్టపరిహారం అందించాలని జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ డిమాండ్ చేసారు. బుధవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో జనసేన నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, వారి కష్టాలను అడిగి తెల్సుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికందే సమయంలో తుఫాను కారణంగా వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని అన్నారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే గ్రామాల్లో పంట నష్టం సర్వే నిర్వహించి, ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని డిమాండ్ చేసారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి, బాధిత రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఆయన వెంట మేడిబోయిన సత్యనారాయణ, జి, కృష్ణ, రాము, నాగేశ్వర రావు, కామరాజు, వీరబాబు, శ్రీను, సురేష్, వాసు, నానాజీ, చిన్నయ్య, వెంకట సాయి, శివ, రమణ, అప్పారావు, శ్రీను, హరికృష్ణ, తదితరులు ఉన్నారు.