సిరాన్యూస్, సామర్లకోట
బాధిత కుటుంబాలకు సరుకులు పంపిణీ : జనసేన పార్టీ ముఖ్య అధ్యక్షుడు తుమ్మల రామస్వామిబాబు
వరదలతో నష్టపోయిన బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నామని జనసేన పార్టీ ముఖ్య అధ్యక్షుడు తుమ్మల రామస్వామిబాబు అన్నారు. బుధవారం పెద్దపురం నియోజక వర్గంలోని సామర్ల కోట మండలంలోని పలు గ్రామాల బాధిత కుటుంబాలకు నిత్యా వసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే పలు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.కార్యక్రమంలో జనసేనా పార్టీ కార్య కర్తలు పాల్గొన్నారు