సిరాన్యూస్, జైనథ్
ముగిసిన జోగు పోతారెడ్డి అంత్యక్రియలు
* నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న సోదరుడు జోగు పోతారెడ్డి గురువారం తనువు చాలించారు. జైనథ్ మండలంలోని దీపాయి గూడ గ్రామంలో నివాసం ఉంటున్న ఆయన స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు దీపాయి గూడకు చేరుకున్నారు. జోగు పోతారెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి సమర్పించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామానికి చేరుకొని జోగురామన్నను పరామర్శించారు. సోదరుడి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం అంతిమయత్రను నిర్వహించగా రాజకీయ ప్రముఖులు, పలువురు ప్రజా ప్రతినిధులు, అభిమానులు పాల్గొని తుది వీడ్కోలు పలికారు. ‘కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి . మాజీ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి. కాంగ్రెస్ నాయకులు . శరత్. అంత్యక్రియల శోభాయాత్రను పాల్గొన్నారు.