సిరా న్యూస్, ఆదిలాబాద్
రైల్వే పనులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష
* ఆదిలాబాద్ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు సరికావు
* దీక్షలకు మద్దతు
* మాజీ మంత్రి జోగురామన్న
ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ పనుల నిమిత్తం గతంలో అనేక మార్లు కేంద్రానికి వినతులు అందించినా ఫలితం లేదని, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వకుండా కేవలం జీవోను విడుదల చేశారని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం ముప్పై ఆరవ రోజుకు చేరుకోగా…. బీఆర్ ఎస్ పార్టీ తరపున మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు. దీక్షలు చేపడుతున్న నాయకులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వకుండా జీవో విడుదల చేసిన కేంద్రం.. ఆ తర్వాత పనుల విషయాన్నీ పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఆదిలాబాద్ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెంచేలా దూర భారాన్ని తగ్గించే విధంగా అదిలాబాద్ టు ఆర్మూర్ మంజూరు కాయ్ ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికిని కేంద్ర నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు, అంతేకాకుండా గత బీఆర్ ఎస్ ప్రభుత్వం కారణంగానే పనులు నిలిచిపోయాయని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుండడం పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదిలాబాద్ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు సరికావన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధించేంత వరకు దీక్షలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.సాధన సమితి చైర్మన్ నారాయణ, నేతలు బండి దత్తాత్రి, విజ్జగిరి నారాయణ, రోకండ్ల రమేష్ ,మెట్టు ప్రహ్లాద్,బండారి సతీష్, సందా నర్సింగ్, అశోక్ స్వామి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.