సిరా న్యూస్,సికింద్రాబాద్;
కంటోన్మెంట్ బోర్డ్ మీటింగ్ తరువాత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వరకు నిర్మించేటువంటి ఫ్లైఓవర్ వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం కానీ దాని పేరు మీద 60 మీటర్ల వెడల్పుతో అక్కడున్న షాపులు, ఇల్లు స్థలాలు పోగొట్టుకున్న వారి గురించి ఆలోచించడం లేదు. ఆ బాధితులకు వెంటనే కంపెన్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. అర్బన్ ఏరియాలో రోడ్లు నిర్మాణం జరుగుతున్నప్పుడు రైల్వే లైన్ దగ్గర, జంక్షన్ రోడ్ల దగ్గర బాగా డిస్టబెన్స్ అవుతుంది రేపటి రోజున మెట్రో రైలు కూడా నిర్మాణం అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఆధునిక పద్ధతిలో నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల 330 కోట్ల విలువయే కంటోన్మెంట్ భూమి తీసుకుంటున్నారు కాబట్టి దానికి కంపెన్సేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి ఆ డబ్బును కేంద్రంలో జమ చేయకుండా మేము మాట్లాడతాం ఆ డబ్బును కంటోన్మెంట్ లోనే జమ చేస్తే ఇక్కడ అభివృద్ధి చేస్తామని కోరడం జరిగింది. మిలిటరీ ఏరియాలో ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో వాటికి వెళ్లడానికి పదేపదే ఇబ్బంది పెడుతున్నారు అట్లాంటి ఇబ్బందులు పెట్టవద్దని కోరానని అన్నారు.