దేశంలోనే సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచిన కాకా

-మంథనిలో ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు

-ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

సిరా న్యూస్,మంథని;

దేశంలోనే సీనియర్ రాజకీయ నేతల్లో గడ్డం వెంకటస్వామి (కాకా) ఒకరని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు.
మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, పట్టణ అధ్యక్షులు పోలు శివ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కేంద్ర మాజీ మంత్రి, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాక) జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.కాక చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ప్రచార కమిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలకల ప్రవీణ్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్ లు మాట్లాడుతూ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు వెంకటస్వామి అనుబంధం ఎనలేనిదని, ఎన్నో పోరాటాలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో వారి యొక్క సేవలను అందించారనీ అన్నారు.
ఆ కాలంలో ఎఫ్సీఐ, సింగరేణి కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతున్న సమయంలో కేంద్రంతో మాట్లాడి సంస్థలను కాపాడిన ఘనత కాక వెంకట స్వామి దన్నారు.20 ఏండ్లు నిండకుండానే ఉద్యమం సాగించారనీ నిజాం వ్యతిరేక పోరాటంలో కాకా వెంకటస్వామి జైలుకెళ్ళారు. ఇలాంటి పట్టుదలే తెలంగాణ ఉద్యమం ఆయన్ని తిరుగులేని నేతగా మార్చిందన్నారు.భవన నిర్మాణ కూలీగా, ఉద్యమకారుడిగా మొదలైన కాకా వెంకటస్వామి ప్రస్థానం… పేదలు, కార్మికుల నాయకుడిగా ఆ తరువాత ఎంపీగా, కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయికి చేరిందని తెలిపారు. మెట్రిక్ మాత్రమే చదివిన ఆయనకు జీవితం నేర్పిన అనుభవమే అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల తరపున ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లిందని,స్వాతంత్ర్యోద్యమం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం దాకా అన్నింటిలోనూ పాల్గొన్న కాకా దేశంలోనే సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారన్నారు.అప్పట్లో హైదరాబాద్ లో బతకడానికి వచ్చిన పేదలు ఖాళీ జాగాల్లో గుడిసెలు వేసుకునేవారని, భూముల విలువ పెరగడంతో భూస్వాములు పేదలను వెళ్లగొట్టడం మొదలుపెట్టారని,గూండాలతో దౌర్జన్యంగా వెళ్లగొడుతున్న తీరును చూసి కదిలిపోయిన వెంకటస్వామి 1949లో దేశంలోనే మొదటిసారిగా జాతీయ గుడిసెల సంఘం పెట్టారన్నారు. కాకా పోరాటంతో హైదరాబాద్ నగరంలోనే దాదాపు 80 వేల మందికి సొంత గూడు దక్కిందని భవన నిర్మాణ కూలీలు, రిక్షా కార్మికుల సమస్యలపైనా కాకా పోరాటం చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముసుకుల సురేందర్ రెడ్డి, గోటికార్ కిషన్ జి, పర్శవేన మోహన్ యాదవ్, రామ్ రాజశేఖర్, తోకల మల్లేష్, చంద్రు రాయమల్లు, ఆర్ల నాగరాజు, లైసెట్టి రాజు, నక్క శంకర్, నూకల కమల్, ఎరుకల రమేష్, సాదుల శ్రీకాంత్, పార్వతి కిరణ్ ,ఆరేల్లి కిరణ్ గౌడ్, రోడ్డ రాజేశ్వర్ లతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *