సిరాన్యూస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గంలో పట్టా పగలే ద్విచక్ర వాహనం చోరీ
కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో సమీపంలో కాళీ కాలేజీలో రోడ్ రాఘవేంద్ర హోటల్ ఎదురుగా పట్టా పగలే ద్విచక్ర వాహనం గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం ఉదయం సమయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై కళ్యాణదుర్గం పట్నం సీఐ చంద్రశేఖర్‌కు బాధితుడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఐ చంద్రశేఖర్ స్పందిస్తూ సీసీ కెమెరాలను పరిశీలిస్తామని తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కళ్యాణదుర్గం మండలంలోని గొల్ల స్వగ్రామానికి చెందిన హనుమంత రాయుడు అనే వ్యక్తి ఆయన కళ్యాణదుర్గం టైలర్ షాప్ కి వచ్చి పని ముగిసిన అనంతరం తిరిగి ఇంటికి గోల గ్రామానికి ద్విచక్ర వాహనం ( బ్లాక్ గ్రే కలర్ కాలా ఏపీ 02, బి 01568 నెంబరు) పై వెళ్లారు.తద్వారా ఆయన దుకాణ షాపులో పని చేసుకుంటూ పనిలో బుధవారం నిమగ్నమయ్యారు. తన వాహన ద్విచక్ర దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలిపారు.దీంతో తనకు సుమారు 50,000 వేల రూపాయలు దాకా ఆర్థికంగా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. చోరీకి గురైన తన ద్విచక్ర వాహనం ఆచూకీ ఎక్కడైనా కనబడితే నెంబర్ కి6302396950కు సమాచారాన్ని చేయాలని కోరారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమంలో హల్‌చాల్ చేస్తుంది.