సిరాన్యూస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
కళ్యాణదుర్గం పట్టణంలోని టీ సర్కిల్ కూడలిలో కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వెంకటంపల్లి రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలను తినిపించుకుని రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రఘువీరా రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కేంద్రంలో ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందోనని కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వెంకటంపల్లి రాంభూపాల్ రెడ్డి అన్నారు. అటు కేంద్రంలో ఇటు ఏపీ రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు మెరుగు పడాలన్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరగాలన్నా, ఆర్థికంగా చితికిపోయిన రైతు గట్టెక్కాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాల ఎర్రిస్వామి, రిటైర్డ్ ఎమ్మార్వో తిమ్మప్ప, కరీం, కొత్తపల్లి ఈరన్న , బొజ్జప్ప, గోవిందప్ప, గోపాల్ , హానుమంతరాయుడు, హానుమంతరాయప్ప, క్రిష్ణమూర్తి ,ఈశ్వర్ప్రసాద్, ముత్యాలప్ప, యాటకల్లు ఈరన్న, చాపిరి పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.