సిరాన్యూస్, ఉట్నూర్
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనం మెచ్చిన నేత జనహృదయనేత ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు మన రాహుల్ గాంధీ అని అన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కౌన్సిలర్ నాయకులు పరిమి సురేష్ , ఉట్నూర్ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.