సిరాన్యూస్,కళ్యాణదుర్గం
నేడు కళ్యాణదుర్గంలో మొబైల్ షాపులు బంద్
కళ్యాణదుర్గంలోని మార్వాడి హోల్ సేల్ వ్యాపారి(మాతాజీ మొబైల్ షాప్) నిరంకుశ వైఖరికి నిరసనగా మంగళవారం మొబైల్ షాపుల నిర్వాహకులు బంద్ పాటించాలని నిర్ణయించారు. ఈసందర్బంగా పలువురు మొబైల్ షాపుల యజమానులు మాట్లాడుతూ మొబైల్ హోల్సేల్ రిటైల్ అన్ని వ్యాపారాలు మాతాజీ మొబైల్ షాప్ యాజమాని నిర్వహిస్తుండడంతో రిటైల్ వ్యాపారస్తులు నష్టపోతున్నారని తెలిపారు. పలుమార్లు ఆయనకు విజ్ఞప్తి చేసిన తన వైఖరిని మార్చుకోలేదని తెలిపారు. దీంతో తాము మొబైల్ షాపులు బంద్ చేపడుతున్నట్లు వారు తెలిపారు.